ఈనాటి వరకు... నా గుండెలయకు.. - Sontham

Movie : Sontham 23 August 2002

Director: Srinu Vaitla

Music director: Devi Sri Prasad

Artists: Shaan, Sumangali

 


ఈనాటి వరకు... నా గుండెలయకు...
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు... మొదలైంది మొదలు...
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
ఈనాటి వరకు... నా గుండెలయకు...
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు... మొదలైంది మొదలు...
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే
మనసా... హా...
ఈనాటి వరకు... నా గుండెలయకు...
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా...
ఈనాటి వరకు... నా గుండెలయకు...
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఒక్కచోటే కలిసి ఉన్నా తనతోపాటు ఇంతకాలం
ఒక్కపూటా కలగలేదే నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంతదూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంటపడని ప్రాణంలాగా గుండెలోనే తానున్నా
జ్ఞాపకాలే తరిమేదాక గురుతురాలేదే...
ఈ తీపిదిగులు... మొదలైంది మొదలు...
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
తన నాన్ననానా తన నాన్ననానా తన నాన్ననానా
తన నాన్ననానా తన నాన్ననానా తాననా...



By lyricslivetv